జ్యోతిరావు పూలే విగ్రహానికి నివాళులర్పించిన MLA, ఎంపీ
HNK: మహాత్మ జ్యోతిరావు పూలే జయంతి సందర్భంగా ములుగు రోడ్డులోని వారి విగ్రహానికి ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి, వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీ సారయ్య, ప్రజా ప్రతినిధులు పూలమాలవేసి నివాళులర్పించారు. మహాత్మ జ్యోతిరావు పూలే చూపిన బాటలో నడుస్తూ సమాజాభివృద్ధికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో పలువురు నేతలు ఉన్నారు.