రేపు రూ.477 కోట్లతో పరిశ్రమలకు శంకుస్థాపన

రేపు రూ.477 కోట్లతో పరిశ్రమలకు శంకుస్థాపన

TPT: పెళ్లకూరు(M) సిరసనంబేడులో మంగళవారం రూ.477 కోట్ల పెట్టుబడులతో పరిశ్రమలకు మంత్రి నిమ్మల రామానాయుడు శ్రీకారం చుట్టనున్నారు. ఈ మేరకు ఉ. 10 గంటలకు MSME పార్క్ సహా మూడు భారీ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయనున్నారు. అయితే CM చంద్రబాబు అమరావతి నుంచి వర్చువల్‌గా పాల్గొని ప్రసంగించనున్నట్లు సూళ్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ కార్యాలయం తెలిపింది.