తహసిల్దార్ కార్యాలయంలో ఇద్దరు అధికారుల సస్పెన్షన్

MBNR: కొందుర్గు మండల తహసిల్దార్ కార్యాలయంలో ఇద్దరు అధికారులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. కార్యాలయంలో పనిచేస్తున్న నాయబ్ తహసిల్దార్ కిష్టయ్య, రికార్డ్ అసిస్టెంట్ బాలరాజులను సస్పెండ్ చేశారు. మండలానికి చెందిన ఆర్మీ జవాన్ కు సంబంధించి భూ రికార్డులు ఇవ్వడానికి లంచం తీసుకున్న వీడియోలు గతంలో వైరల్ అయ్యాయి.