రేపు నిజాంపల్లిలో ఉచిత వైద్య శిబిరం
BHPL: నిజాంపల్లి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో బుధవారం (రేపు) ఉ.9 గం నుంచి మ.3 గం వరకు ప్రజ్వల్ సంస్థ, మెడికవర్ హాస్పిటల్ & లయన్స్ క్లబ్ సహకారంతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించనున్నారు. ఈ వైద్య శిబిరంలో గుండె పరీక్షలు, కంటి పరీక్షలు, రక్త పరీక్షలు తదితర పరీక్షలు చేయనున్నారు. గ్రామ ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సర్పంచ్ సునీత కోరారు.