ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తున్న వర్షపు నీరు

RR: రంగారెడ్డి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఇటీవల భారీ వర్షాలు కురిసాయి. దీంతో హిమాయత్ సాగర్‌కు భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. వరద నీరు వచ్చి చేరుతుండడంతో ఓఆర్ఆర్ సర్వీస్ రోడ్డు ఎగ్జిట్ 17 వద్ద ప్రమాదకరస్థాయిలో వర్షపు నీరు ప్రవహిస్తుంది. దీంతో సర్వీసు రోడ్డును పోలీసులు మూసివేశారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు.