రోడ్డు ప్రమాదంలో డ్రైవర్ మృతి
MLG: జిల్లాలో మరో రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ములుగు మండలం వంటిమామిడి సమీపంలోని రాజీవ్ రహదారిపై ఆగి ఉన్న లారీని మరో లారీ ఢీకొట్టగా.. డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతుడు హరీష్ సింగ్‌గా గుర్తించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై విజయ్ కుమార్ పేర్కొన్నారు.