కుమార్తె పెళ్లి ఆగిపోయిందని తండ్రి ఆత్మహత్య
HYD: కుమార్తె పెళ్లి ఆగిపోవడంతో తండ్రి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. HYDలోని కార్పొరేట్ ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్న తన కూతురికి, చినముషిడివాడకు చెందిన యువకుడితో పెళ్లి కుదిరింది. వివాహ ఏర్పాట్లు పూర్తై, పత్రికలు అందించాక, పెళ్లి వద్దంటూ పెళ్లికొడుకు తండ్రి చెప్పాడు. కాళ్ల మీద పడ్డా వినకపోవడంతో మనస్తాపానికి గురైన ఆమె తండ్రి శ్రీనివాస్ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు.