విజయనగరంలో కొవ్వొత్తుల ర్యాలీ

VZM: జమ్మూ కాశ్మీర్ పహల్గామ్‌లోనీ బైసరన్ ప్రాంతంలో ఉగ్రవాదుల దాడుల్లో మరణించిన వారికి సంతాపం తెలుపుతూ బుధవారం కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ విజయనగరం జనసేన పార్టీ ఆధ్వర్యంలో కోట జంక్షన్ నుండి గంటస్తంభం వరకు ఈ ర్యాలీ కొనసాగింది. ఈ ర్యాలీలో ఎమ్మెల్యే అదితి గజపతి రాజు, యశస్వి పాల్గొన్నారు.