నామినేషన్ కేంద్రాల పరిశీలన

నామినేషన్ కేంద్రాల పరిశీలన

MBNR: బాలానగర్ మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం, పెద్ద రేవల్లి, తిరుమలగిరి నామినేషన్ కేంద్రాలను జిల్లా ఎస్పీ డీ.జానకి బుధవారం పరిశీలించారు. నామినేషన్ కేంద్రంలోని సౌకర్యాలపై అధికారులతో కలిసి తెలుసుకున్నారు. నామినేషన్ కేంద్రాల వద్ద పోలీసు పటిష్టతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సీఐ నాగార్జున, ఎస్సై లెనిన్ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డి పాల్గొన్నారు.