'దెబ్బతిన్న పంటలకు వెంటనే సర్వే నిర్వహించాలి'

KMM: అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలకు వెంటనే సర్వే నిర్వహించి, ఆ సర్వే ఆధారంగా రైతులకు పరిహారం చెల్లించాలని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు పోతినేని సుదర్శన్ రావు డిమాండ్ చేశారు. బోనకల్ మండల పరిధిలోని రావినూతల, గార్లపాడు, రామాపురం గ్రామాల్లో అకాల వర్షాల వల్ల దెబ్బతిన్న పత్తి, ఇతర పంటలను శనివారం సంఘం జిల్లా నాయకులు, రైతులతో కలిసి పరిశీలించారు.