అమర జవాన్ సైదా నాయక్ విగ్రహ ఆవిష్కరణ
PLD: మాచవరం మండలం చెన్నాయపాలెం గ్రామంలో ఆర్మీ జవాన్ బాణావత్ సైదా నాయక్ విగ్రహాన్ని బుధవారం ఆవిష్కరించారు. ఈ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా మాచవరం ఎస్సై కె పవన్ కుమార్ పాల్గొన్నారు. అమర జవాన్ కుటుంబ సభ్యులు గ్రామస్తులతో పాటు చుట్టుపక్కల గ్రామాలకు చెందిన యువకులు, ప్రజలు భారీగా పాల్గొన్నారు.