VIDEO: గుంతలమాయంగా మారిన ప్రధాన రహదారి
NGKL: బిజినపల్లి-మంగనూరు ప్రధాన రహదారిపై వెలుగొండ గేటు వద్ద భారీ గుంతలతో వాహనదారులు విలవిల్లాడుతున్నారు. ఆరు నెలలుగా అధికారులు పట్టించుకోకపోవడంతో రాత్రి వేళల్లో ప్రమాదాలు జరుగుతున్నాయని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఆర్అండ్‌బీ అధికారులు స్పందించి తక్షణమే మరమ్మతులు చేపట్టాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.