ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన సుమంత్
SRPT: హుజూర్ నగర్ మండల పరిషత్ అభివృద్ధి అధికారి (ఎంపీడీవో) గా మండల పరిషత్ కార్యాలయంలో గురువారం సుమంత్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎల్లప్పుడూ ప్రభుత్వం ప్రజలకు అందజేసే సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు సత్వరమే అందేలా కృషి చేస్తానన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండి మెరుగైన సేవలు అందిస్తానని అన్నారు.