కోర్టు మానిటరింగ్ సభ్యులతో సమావేశం

ELR: జిల్లా ఎస్పీ కార్యాలయంలో శనివారం అడిషనల్ ఎస్పీ అడ్మిన్ సూర్య చంద్రరావు ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, పోలవరం సబ్ డివిజన్‌లకు చెందిన కోర్టు మానిటరింగ్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. కేసుల విచారణ వేగంగా జరగాలంటే సాక్షులను సమయానికి హాజరు చేయడం అనివార్యమని తెలిపారు. నేరస్తులు శిక్ష తప్పించుకోకూడదని, బాధితులు న్యాయం పొందేలా ఉండాలన్నారు.