DRDO ఘనత.. నావికాదళానికి కొత్త బలం!
DRDO కొత్త తరం మ్యాన్-పోర్టబుల్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్స్(MP-AUV)ను విజయవంతంగా అభివృద్ధి చేసింది. ఈ MP-AUVలలో మైన్ వంటి వస్తువులను గుర్తించేందుకు సైడ్ స్కాన్ సోనార్, అండర్ వాటర్ కెమెరాలు ఉంటాయి. వీటిలో ఉండే డీప్ లెర్నింగ్ అల్గారిథమ్స్ ఆపరేటర్ల పనిభారాన్ని తగ్గిస్తాయి. విశాఖలోని DRDO ల్యాబ్(NSTL) వీటిని అభివృద్ధి చేసింది. ఇది నావికాదళానికి బలం చేకూర్చనుంది.