'వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను తరలించాలి'

'వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్‌ను తరలించాలి'

KNR: హుజురాబాద్ మండలం సిర్సపల్లి వద్ద ఏర్పాటు చేస్తున్న 'వేస్ట్ టు ఎనర్జీ' ప్లాంటును వేరే చోటుకు తరలించాలని మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీదేవికి కాంగ్రెస్ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ విన్నవించారు. మంగళవారం హైదరాబాద్‌లో ఆమెను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్లాంట్ నివాస ప్రాంతాలకు దగ్గరగా ఉండటంతో ప్రజారోగ్యానికి ముప్పు వాటిల్లుతుందని వివరించారు.