'వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండొద్దు'

'వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండొద్దు'

MLG: వేధింపులు ఎదురైతే మౌనంగా ఉండవద్దని,వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని కానిస్టేబుల్ చైతన్య అన్నారు. మల్లంపల్లి మండలం మహమ్మద్ గౌస్ పల్లిలో డయల్ 100,112, టీ-సేఫ్ యాప్, ఈవ్ టీజింగ్, బాల్య వివాహాలపై అవగాహన కల్పించారు. షీ టీం సేవలను వివరించారు. ఏదైనా సమస్య వస్తే 8712576528 నంబర్‌కు ఫోన్ చేయాలని తెలిపారు. పంచాయతీ కార్యదర్శి జ్యోతి, కానిస్టేబుల్ యశోద పాల్గొన్నారు.