VIDEO: గంగపుత్రులకు సర్వేలో అన్యాయం: సైదులు
MUL: ఏటూరునాగారం మండలంలో సామాజిక ఆర్థిక సర్వే జాబితాలో బెస్త (గంగపుత్ర), గూండ్ల కులాల పేర్లు లేకపోవడంపై రాష్ట్ర నాయకుడు సైదులు ఆవేదన వ్యక్తం చేశారు. ఏజెన్సీ మండలాల్లో తమకు అన్యాయం జరుగుతోందని పేర్కొంటూ అధికారులు స్పందించాలని శుక్రవారండిమాండ్ చేశారు. సీఎం జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. లేదంటే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు.