సోమశిలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా: మంత్రి

సోమశిలను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతా: మంత్రి

NGKL: సోమశిల ప్రాంతాన్ని పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు టూరిజం శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. కొల్లాపూర్ మండలంలోని సోమశిల, అమరగిరి ఐలాండ్ ప్రాంతాలలో వెల్‌నెస్, స్పిరిచువల్ రీట్రీట్ ప్రాజెక్టు పనులకు మంత్రి జూపల్లి శుక్రవారం శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. టూరిజం అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచించారు.