నేడు ఉచిత కంటి వైద్యశిబిరం
ATP: రాప్తాడు మండలంలోని పేరూరులో జిల్లా అందత్వ నివారణ సంస్థ, బెంగళూరు శంకర కంటి ఆస్పత్రి సంయుక్త సహకారంతో గురువారం ఉచిత కంటి వైద్యశిబిరాన్ని నిర్వహించనున్నట్టు నిర్వాహకుడు పేరూరు కోడిరామ్మూర్తి బుధవారం ప్రకటనలో తెలిపారు. స్థానిక పెద్దమ్మ ఆలయం వద్ద ఉదయం 8 నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు ఈ శిబిరాన్ని నిర్వ హించనున్నట్లు చెప్పారు. అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు.