అక్రమంగా నిల్వచేసిన 41 సిలిండర్లు సీజ్
SRPT: అక్రమంగా నిల్వచేసిన 41 సిలిండర్లను సూర్యాపేట పట్టణ పోలీసులు, స్పెషల్ బ్రాంచ్ పోలీస్ సిబ్బంది సంయుక్తంగా పట్టణంలోని పీఎస్‌ఆర్ సెంటర్లో ఒక షాపులో తనిఖీలు చేసి శుక్రవారం సీజ్ చేశారు. ఇందులో గృహ ఉపయోగకరమైనవి 21, వాణిజ్యపరమైనని 20 ఉన్నట్లు వారు తెలిపారు. అనంతరం అక్రమంగా గ్యాస్ సిలిండర్ల వ్యాపారం నిర్వహిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు.