ఉప సర్పంచ్‌కు పెరిగిన పోటీ

ఉప సర్పంచ్‌కు పెరిగిన పోటీ

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో పంచాయతీ ఎన్నికల వేడి పెరుగుతున్నది. సర్పంచ్‌ రిజర్వేషన్లు కలిసిరాని ఆశావహులువార్డు నెంబర్‌గా పోటీ చేసి చెక్‌ పవరున్న ఉప సర్పంచ్‌ పదవి కైవసం చేసుకునేందుకు పోటీలో దిగుతున్నారు. సర్పంచ్‌తో పాటు ఉప సర్పంచ్‌కు చెక్‌పవర్‌ ఉండడంతో ఆ దిశగా పావులు కదుపుతున్నారు. ఇతర సభ్యుల మద్దతును కూడగట్టుకొనే ప్రయత్నాలను ముమ్మరంగా చేస్తున్నారు.