బీజేపీలో చేరిన మాజీ సర్పంచ్
NRML: నిర్మల్ రూరల్ మండలం డ్యాంగాపూర్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ మాజీ సర్పంచ్ ముక్కెర ముత్తన్నతో పాటు పలువురు నాయకులు గురువారం బీజేపీలో చేరారు. ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి సమక్షంలో వారు కండువా ధరించి అధికారికంగా చేరికయ్యారు. ఈ కార్యక్రమంలో రమణ రెడ్డి, జమాల్, సత్యం చంద్రకాంత్, మండల అధ్యక్షులు వెంకట్ రెడ్డి, చిన్నయ్య, తదితరులు పాల్గొన్నారు.