అన్నవరంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్

అన్నవరంలో ఇద్దరు ఉద్యోగుల సస్పెన్షన్

కోనసీమ: అన్నవరం పుణ్యక్షేత్రం వరుస వివాదాలతో వార్తల్లో నిలుస్తోంది. సోమవారం అధికారులు ఇద్దరు ఉద్యోగులను సస్పెండ్ చేశారు. సత్యదేవ డిగ్రీ కళాశాల లెక్చరర్ లచ్చన్న విద్యార్థిని వేధించగా, నమూనా దేవాలయం ఉద్యోగి రాజేంద్రప్రసాద్ మద్యం సేవించి విధులకు హాజరయ్యాడు. ఈవో సుబ్బారావు వారిని సస్పెండ్ చేసి తదుపరి విచారణకు ఆదేశించారు.