'ప్రజా సమస్యల పరిష్కార దిశగా అడుగులు వేయాలి'
SKLM: ప్రజల సమస్యలు పరిష్కారమయ్యే దిశగా ప్రతి ఒక్కరూ అడుగులు వేయాలని బేజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పైడి వేణుగోపాలరావు అన్నారు. టెక్కలి మండల కేంద్రంలోని బీజేపీ కార్యాలయంలో మండల అధ్యక్షులు జర్జాన రాంజీ ఆధ్వర్యంలో శనివారం టెక్కలి నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వేణు గోపాలరావు, సిరిపురం తేజేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.