VIDEO: 'మద్యం దుకాణం ఏర్పాటు చేయొద్దు'
ఖమ్మం నగరంలోని జమ్మిబండలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రతి ఏటా బతుకమ్మ ఉత్సవాలు, దసరా వేడుకలు జరిగే ఆధ్యాత్మిక ప్రదేశానికి ఆనుకొని ఉన్న ప్రైవేట్ స్థలంలో మద్యం దుకాణం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా బీజేపీ నాయకులు గురువారం నిరసన తెలిపారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో అక్కడి నుంచి జిల్లా ఎక్సైజ్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు.