కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం: ఎమ్మెల్యే

కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలం: ఎమ్మెల్యే

MDK: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తీవ్రమైన యూరియా కొరత ఏర్పడిందని, యూరియా సరఫరా చేయడంలో పూర్తిగా ప్రభుత్వం విఫలమైందని ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి మంగళవారం అన్నారు. చేగుంట మండలం మక్కరాజుపేటలో యూరియా కోసం క్యూలైన్లో ఉన్న అన్నదాతలతో మాట్లాడారు. రైతులకు సరిపడా యూరియాను వెంటనే సరఫరా చేయాలని ఆయన డిమాండ్ చేశారు.