కిన్నెరసాని జలాశయానికి భారీగా వరద నీరు

BDK: ఎగువన కురుస్తున్న వర్షాలకు కిన్నెరసాని జలాశయానికి వరద ఉధృతి పెరిగింది. రిజర్వాయర్ లోకి 17,700 క్యూసెక్కుల నీరు వస్తుందని అధికారులు తెలిపారు. దీంతో శనివారం రాత్రి మూడు గేట్లను ఎత్తి 15,000 క్యూసెక్కుల నీటిని గోదావరిలోకి విడుదల చేశారు. వరద ప్రవాహం పెరుగుతుండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు ఆదివారం సూచించారు.