'ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలి'

NLG: తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తితో కార్మిక వర్గం ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి ఐక్య పోరాటాలకు సిద్ధం కావాలని CITU జిల్లా ఉపాధ్యక్షులు ఎండీ సలీం, జిల్లా కార్యదర్శి దండంపల్లి సత్తయ్య పిలుపునిచ్చారు. నల్గొండలోని సుందరయ్య భవన్‌లో ఇవాళ జరిగిన CITU పట్టణ కమిటీ సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ఈనెల 17న జరిగే ముగింపు సభలో CITU సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొనాలన్నారు.