సీలేరులో విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి
ASR: సీలేరు ఏపీ జెన్కో పవర్ ప్లాంట్‌లో విషాదం చోటుచేసుకుంది. గురువారం విధి నిర్వహణలో ఉండగా గణేష్ అనే ఒప్పంద లైన్ మెన్ విద్యుత్ షాక్‌కు గురయ్యారు. తీవ్ర గాయాలైన ఆయన్ను వెంటనే చింతపల్లి సామాజిక ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందారు. లైన్ మెన్ మరణంతో ఆయన కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ఘటనపై అధికారులు విచారణ చేపట్టారు.