ఇందిరమ్మ ఇళ్లపై గుత్తా కీలక వ్యాఖ్యలు

ఇందిరమ్మ ఇళ్లపై గుత్తా కీలక వ్యాఖ్యలు

TG: ఇందిరమ్మ ఇళ్ల పథకంలో అవకతవకలు ఉన్నాయని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. ఉపాధి కోసం తెచ్చుకున్న టాటా ఏస్ వాహనాన్ని ఫోర్ వీలర్‌గా పరిగణించి, పేదలను పథకానికి అనర్హులుగా చేయడం సరికాదన్నారు. ఇప్పటికే బేస్‌మెంట్లు నిర్మించుకున్న వారిని అనుమతించాలని, రెండో విడతలో నిబంధనలను సవరించాలని సూచించారు.