VIDEO: డివైడర్‌ను ఢీకొట్టిన కంటైనర్ లారీ

KMM: చైతన్య నగర్ టేకులపల్లి బ్రిడ్జి వద్ద మంగళవారం తెల్లవారుజామున, వైరా నుండి ఖమ్మం వైపు వస్తున్న కంటైనర్ లారీ డ్రైవర్ నిద్ర మత్తులో డివైడర్ సిమెంటు దిమ్మెలపై దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న ట్రాఫిక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని, ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా రహదారిని క్లియర్ చేశారు.