బడి పిల్లలకు 'వ్యాన్' బహుమతి
MHBD: జిల్లాలోని నెల్లికుదురు మండలం పార్వతమ్మగూడెం UPS విద్యార్థులకు రవాణా కష్టాలు తీరాయి. కార్పొరేట్ దీటుగా విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయ బృందం కృషిని అభినందిస్తూ.. భూక్య వెంకన్న అనే లైబ్రేరియన్ విద్యార్థుల రాకపోకల కోసం వ్యాన్ను వితరణగా అందజేశారు. HM నరేంద్ర కుమార్ ఆధ్వర్యంలో పాఠశాల సాధిస్తున్న ప్రగతిని చూసి ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.