మెదక్ జిల్లాలో దంచి కొట్టిన వర్షం

మెదక్ జిల్లాలో దంచి కొట్టిన వర్షం

MDK: మెదక్ జిల్లాలో గత 24 గంటల్లో అత్యధిక వర్షపాతం నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. రామాయంపేటలో అత్యధికంగా 91 మిమీ, అత్యల్పంగా రేగోడ్ 1.0 మిమీ వర్షపాతం నమోదైంది. అటు మనోహరాబాద్ 90.6, పెద్ద శంకరంపేట 83.8, నర్సాపూర్ 73, కౌడిపల్లి 63.8, వెల్దుర్తి 63.3, చిలిప్ చెడ్ 60.8, చేగుంట 59.8, పాపన్నపేట్ 57.3, టేక్మాల్ 55 వర్షపాతం నమోదయింది.