కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవం విషయంలో ప్రోటోకాల్ వివాదం
నల్గొండ మండలం ఖాజీరామారంలో ప్రోటోకాల్ వివాదం రాజుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవానికి సర్పంచ్ సల్వాది సైదులును ఆహ్వానించకుండా అధికారులు, కాంగ్రెస్ నేతలు తీవ్రంగా అవమానించారని, దళిత సంఘాలు మండిపడుతున్నాయి. నిబంధనలు తుంగలో తొక్కి, సర్పంచ్ పట్ల వివక్ష చూపించి, ఇవాళ కొనుగోలు కేంద్రం ప్రారంభించడం పట్ల పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.