సునీత పోరాటానికి మద్దతు: ఎమ్మెల్యే
సత్యసాయి: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో న్యాయం కోసం ఆయన కుమార్తె వైఎస్ సునీత చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ ప్రకటించారు. సునీతకు బాసటగా నియోజకవర్గంలో భారీగా సంతకాల సేకరణ, కొవొత్తుల ర్యాలీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఉద్యమం వైసీపీ నైతికతను ప్రశ్నిస్తుందని ఆయన పేర్కొన్నారు.