శ్రీకృష్ణస్వామి ఆలయంలో భారీ భక్తుల రద్దీ

GDWL: మల్దకల్ మండలం సద్దలోనిపల్లిలోని శ్రీకృష్ణస్వామి ఆలయం శనివారం కృష్ణస్వామి పండుగ సందర్భంగా భక్తులతో కిటకిటలాడింది. క్రమంలో ఆలయ ప్రధాన అర్చకులు మాట్లాడుతూ.. సకాలంలో వర్షాలు కురిసి ఎలాంటి పంట నష్టం జరగకుండా కాపాడాలని కోరుతూ దేవునికి ప్రత్యేక పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఆలయాన్ని దర్శించుకున్నారు.