'జనగణన ప్రక్రియ నిర్ణీత కాలంలో పూర్తి చేయాలి'
JGL: జనగణన ప్రక్రియను నిర్ణీత కాలంలో పూర్తి చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. వెల్గటూర్ మండల తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న జనగణన పనులను పరిశీలించిన సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. జనగణనలో ప్రతి వివరాన్ని ఖచ్చితంగా నమోదు చేయాలని, ఎటువంటి పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా విధులు నిర్వహించాలని సూచించారు.