హోలీ స్పెషల్.. 62 ప్రత్యేక రైళ్లు
VSP: రాబోయే హోలీ పండుగ రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రయాణికుల సౌకర్యార్థం మార్చి నెలలో 62 ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రకటించింది. ముఖ్యంగా విశాఖ నుంచి తిరుపతి, బెంగళూరు, చర్లపల్లి, శాలిమార్‌తో పాటు పూరీ, భువనేశ్వర్ వంటి ప్రధాన మార్గాల్లో ఈ రైళ్లు అందుబాటులో ఉంటాయని వెల్లడించింది.