కోనసీమ ప్రత్యేకం.. ఎర్ర చక్రకేళి
కోనసీమ ప్రాంతంలో పండించే ఎర్రచక్రకేళికి విదేశాల్లోనూ మంచి ఆదరణ ఉంది. ఇందులో పోషకాలు ఉండటం వల్ల తినేందుకే కాకుండా రెస్టారెంట్లలో వంటకాల్లోనూ ఉపయోగిస్తుంటారు. రావులపాలెం మండలం కొమరాజులంక, రావులపాడు, లక్ష్మీపోలవరం, ఆత్రేయపురం మండలం ర్యాలి, కొత్తపేట మండలంలోని పలు గ్రామాల్లో ఎక్కువగా ఎర్ర చక్రవేళిని పండిస్తున్నారు. మలేషియా లాంటి దేశంలోనూ వంటల్లో వాడుతారు.