VIDEO: కుక్కను తప్పించబోయి గుంతలోకి దూసుకెళ్లిన కారు
అన్నమయ్య: కురబలకోట మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో మదనపల్లికి చెందిన ఆనందనాయుడు (65), భవానిదేవి (63) దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. బి.కొత్తకోట మండలం చలిమామిడి ఆలయంలో పూజలు ముగించుకుని కారులో తిరిగి వస్తుండగా, చెన్నా మర్రిమెట్ట వద్ద అకస్మాత్తుగా ఎదురుగా వచ్చిన కుక్కను తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి దూసుకెళ్లినట్లు స్థానికులు తెలిపారు.