రైలు కింద పడి వ్యక్తి మృతి

రైలు కింద పడి వ్యక్తి మృతి

KDP: కడప-కనుములో పల్లె మధ్యలోని రైలు పట్టాలపై గుర్తుతెలియని మృతదేహం లభ్యమైందని రైల్వే పోలీసులు తెలిపారు. ఆయనకు సుమారు 40 ఏళ్ళు ఉంటాయని, రైలు పట్టాలపై తలపెట్టి ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నామని వారు చెప్పారు. అతని వద్ద ఎలాంటి ఆధారాలు లభ్యం కాలేదని.. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు వారు తెలిపారు.