శబరిమలకు సైకిల్ యాత్ర
VSP: భీమిలికి చెందిన గురుస్వామి గుడ్ల నరసింహారెడ్డి, దుర్రి గురువులు రెడ్డితో పాటు విజయనగరం జిల్లాకు చెందిన సాడి పైడిరాజు బుధవారం సాయంత్రం సైకిళ్లపై శబరిమల యాత్రకు బయలుదేరారు. నరసింహారెడ్డి, గురువులు రెడ్డి సైకిళ్లపై యాత్ర చేయడం ఇది మూడోసారి కావడం విశేషం. అయ్యప్ప దీక్షతో ఆరోగ్యం, సహనం అలవడతాయని స్వాములు తెలిపారు.