మే చివరి నాటికి పనులన్నీ పూర్తి చేస్తాం: ఇంజినీర్లు
KRNL: తుంగభద్ర జలాశయం 33 కొత్త గేట్లతో సరికొత్త రూపు సంతరించుకుంటోంది. దశాబ్దాల కాలం నాటి పాత గేట్ల స్థానంలో రూ.47 కోట్లతో ఆధునిక గేట్లను బిగిస్తున్నారు. ఇప్పటికే 26 గేట్లు బిగించి, 22 గేట్లకు ట్రయల్ రన్ పూర్తి చేశామని అధికారులు తెలిపారు. వచ్చే ఖరీఫ్ నుంచి జలాశయం పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానుంది. మే చివరి నాటికి పనులన్నీ పూర్తి చేస్తామని ఇంజినీర్లు వెల్లడించారు.