రేపు తుది దశ గ్రామ పంచాయతీ సంగ్రామం
NZB: డొంకేశ్వర్ మండల పరిధిలోని 13 గ్రామాల్లో తుది విడత ఎన్నికల పర్వం పోలింగ్ రేపు ప్రారంభం కానుంది. 13 సర్పంచ్ స్థానాలకు గాను సిర్పూర్ పంచాయతీ సర్పంచ్ ఏకగ్రీవమవగా మిగిలిన సర్పంచ్ స్థానాలు, మండలంలోని వార్డులకు రేపు ఎన్నికలు జరగనున్నాయి. కాగా మండలంలో 7,696 మంది పురుషులు, 9,064 మంది మహిళలు వెరసి 16,760 మంది ఓటర్లు ఉన్నారు.