ఎస్పీ కార్యాలయానికి 89 మంది ఫిర్యాదులు

PLD: ఫిర్యాదు దారుని సమస్యల పట్ల శ్రద్ధ వహించి వారి సమస్యలను గడువులోగా పరిష్కరించాలని ఎస్పీ శ్రీనివాసరావు ఆదేశించారు. పల్నాడు జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొని ఎస్పీ ఫిర్యాదులను స్వీకరించారు. ఆర్థిక, కుటుంబ తదితర సమస్యల పరిష్కారం కోసం 89 మంది వినతి పత్రాలను అందజేశారు.