ఉట్నూర్ ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రుత్విక్ సాయి
ADB: ఉట్నూర్ ASPగా రుత్విక్ కొట్టే నియమితులయ్యారు. డీజీపీ శివధర్ రెడ్డి ఉత్తర్వుల మేరకు ఆయన బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. 2023 బ్యాచ్‌కు చెందిన రుత్విక్ గతంలో వేములవాడ ఏఎస్పీగా విధులు నిర్వహించి, బదిలీపై ఉట్నూర్‌కు వచ్చారు. శాంతిభద్రతల పరిరక్షణకు తనవంతు కృషి చేస్తానన్నారు.