విద్యుత్ తీగ తగిలి గేదె మృతి

విద్యుత్ తీగ తగిలి గేదె మృతి

అనంతపురం జిల్లా కూడేరు మండలం కరుట్లపల్లి గ్రామానికి చెందిన  నాగయ్య అనే రైతుకు సంబందించిన గేదె ఎప్పటి లాగానే తన గేదెలను మేపడానికి గ్రామ శివారులోని తోటలోకి తీసుకువెళ్ళాడు. అయితే అక్కడ విద్యుత్ ట్రాన్స్‌ఫార్మర్ దగ్గర తెగిపడిన వైరను గేదె తాకి అక్కడిక్కడే చనిపోయిందని తెలిపారు. తాను అప్పు చేసి వారం రోజుల క్రితం ఆ గేదును కొన్నానని తనను ప్రభుత్వం ఆదుకోవాలన్నాడు.