VIDEO: ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు

VIDEO: ఆటో బోల్తా.. ముగ్గురికి తీవ్ర గాయాలు

SRPT: మేళ్లచెరువు మండలంలో మేళ్లచెరువు, రేవూరు మార్గమధ్యంలో వ్యవసాయ కూలీలతో వెళ్తున్న ఆటో బోల్తా కొట్టిన ఘటన శనివారం చోటుచేసుకుంది. వ్యవసాయ కూలీలతో పొలం పనుల నిమిత్తం రేవూరుకి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. ఆటో బోల్తా కొట్టడంతో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. మెరుగైన వైద్యం కోసం కోదాడ ప్రభుత్వాసుపత్రికి తరలించారు.