నియోజకవర్గ స్టూడెంట్ ఎమ్మెల్యేగా స్నేహ ఎంపిక
AKP: నర్సీపట్నం నియోజకవర్గం స్టూడెంట్ ఎమ్మెల్యేగా నాతవరం మండలం చమ్మచింత హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థిని స్నేహ ఎంపికయ్యింది. ఈనెల 26వ తేదీన అమరావతిలో జరగబోయే స్టూడెంట్స్ అసెంబ్లీ సమావేశంలో స్నేహ నర్సీపట్నం నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించబోతుంది. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు ప్రసాద్, ఉపాధ్యాయులు అభినందనలు తెలియజేశారు.